శ్యామ్ సింగరాయ్ శాటిలైట్ రైట్స్... జెమినీ టీవీకి

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతిక శెట్టి, మడోన్నా సెబాస్టియన్స్ హీరోయిన్స్‌గా రూపొందుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. నాని కెరీర్‌లో చారిత్రిక నేపధ్యంతో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రూ.10 కోట్లకు జెమినీ టీవీ దక్కించుకొంది. నానీ కెరీర్‌లో ఇదీ మరో కొత్త రికార్డే. 

కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో నాని విప్లవ రచయితగా, సాయిపల్లవి దేవదాసిగా చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాని రెండు వేర్వేరు పాత్రలు పోషించినట్లు సమాచారం.    

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకట్ బోయిపల్లి శ్యామ్ సింగరాయ్‌ని నిర్మించారు. ఈ నెల 24వ తేదీన విడుదల కాబోతోంది.

కధ: జంగ సత్యదేవ్; సంగీతం: మికీ జె మేయర్.