రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం థియెట్రికల్ ట్రైలర్ ఈరోజు ఉదయం విడుదలైంది. ప్రజలు, అభిమానుల అంచనాలకు మించి ఉంది. ఊహించినట్లే చాలా భారీ సెటింగ్స్, ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సీన్స్‌తో చాలా గొప్పగా ఉంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూ.ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. అల్లూరి సీతారామ రాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసినట్లు అందరికీ తెలుసు కానీ కానీ అల్లూరి సీతారామరాజు చరిత్రలో ఎన్నడూ బ్రిటిష్ పాలకులకు పని చేయలేదు. ఈ సినిమాలో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా చూపించడం విశేషం. ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, కొమురం భీమ్‌తో చేతులు కలిపి పోరాడినట్లు ట్రైలర్‌లో చూపారు రాజమౌళి. ఇక గోండు తెగకు చెందిన కొమురం భీమ్‌ను ముస్లిం వేషధారణలో చూపారు. కనుక ఈ రేడు ట్విస్టులు ఏమిటో సినిమా చూస్తే గానీ అర్ధం కాదు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, ఆలియా భట్, హాలీవు నటి ఒలివియా మోరిస్, ఆలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్, ఇంకా శ్రీయా శరణ్, అరుణ్ సాగర్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. జనవరి 7వ తేదీన ఆర్‌ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది.