సంబంధిత వార్తలు
అప్పుడప్పుడు తెలుగు సినిమాలు ఆస్కార్ బరిలో కనిపిస్తుంటాయి. కానీ షార్ట్ ఫిలిమ్స్ పెద్దగా కనబడవు. ముఖ్యంగా తెలుగు షార్ట్ ఫిలిమ్స్ అసలే కనబడవు. కానీ తొలిసారిగా తెలుగు షార్ట్ ఫిలిమ్ ‘మనసానమహ’ ఆస్కార్ అవార్డుల జాబితాలో నామినేట్ అయ్యింది. దీపక్ రెడ్డి దర్శకత్వంలో వెలువడిన ఈ షార్ట్ ఫిలిమ్‌లో విరాజ్ అశ్విన్, దృషికా చందర్, శ్రీవల్లి రాఘవేందర్ ప్రధాన పాత్రలు చేశారు. ఇప్పటివరకు ఈ సినిమా 300 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించబడి అనేక అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకొంది.