
అక్కినేని నాగ చైతన్యతో విడిపోయిన తరువాత సమంత తొలిసారిగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంగా గురించి మాట్లాడారు. “చైతుతో విడిపోయిన తరువాత ఆ బాధ నుంచి తేరుకోగలనో లేదో... ఆ దిగులుతోనే చనిపోతానేమో... అని నేను భయపడ్డాను. కొన్ని రోజులు చాలా ఆవేదన అనుభవించాను కూడా. కానీ క్రమంగా జీవితంలో ఎదురయ్యే ఇటువంటి ఒడిదుడుకులను అంగీకరించి తట్టుకొని నిలబడాలని గ్రహించాను. అప్పటి నుంచే నేను మానసికంగా ధృడపడ్డాను. ఇంత త్వరగా నేను ఆ బాధ నుంచి తేరుకొంటానని అనుకోలేదు. నాలో ఈ మార్పు చూసి నాకే ఆశ్చర్యం కలిగేది. ఆ బాధ నుంచి తేరుకొన్నాక మళ్ళీ నేను నా కెరీర్‌పై దృష్టి పెట్టాను. యశోద అనే పాన్ ఇండియా మూవీ మొదలుపెట్టాను. ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే హాలీవుడ్ సినిమా చేయబోతున్నాను,” అని చెప్పారు.