పూరి తిట్టినా అందంగా ఉంటుంది..!

కళ్యాణ్ రామ్ పూరి జగన్నథ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇజం.. కళ్యాణ్ రామ్ ను డిఫరెంట్ స్టైల్ లో ప్రమోట్ చేసిన పూరి సినిమా హిట్ కొడతాడనే అనిపిస్తుంది. ఇక నిన్న జరిగిన ఆడియో వేడుకలో సినిమాలో పనిచేసిన అందరు తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ మాటలు అందరిని ఆకట్టుకున్నాయి. పూరి సినిమా అంటే ఓ స్పెషల్ అని.. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సర్ ప్రైజ్ చేస్తాడని.. ట్రెండ్ ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ ఓ క్లాసి మాస్ సినిమాలు తీస్తాడని అన్నారు ప్రకాశ్ రాజ్. ఇక పూరి రాసే డైలాగుల్లో తిట్టడం కూడా తనకు నచ్చుతుందని అన్నారు.

తిట్టినా అదో ఎక్స్ ప్రెసివ్ థింగ్ అనే భావన వచ్చేలా ఫీల్ కలిగిస్తాడు పూరి అందుకే పూరి నచ్చుతాడని అన్నారు. ఇక ఇజం హీరో కం ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గురించి చెబుతూ సినిమా కోసం పడిన తపన చాలా గొప్పదని.. షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఈరోజు వరకు కళ్యాణ్ రాం తపన పడిన కష్టం అద్భుతం అని సినిమా ఫలితం కచ్చితంగా పాజిటివ్ గానే ఉంటుందని అన్నారు. తన సోదరుడు దగ్గర నుండి పోటీ ఉన్నా ఓ పక్క హీరోగా నిర్మాతగా కళ్యాణ్ రాం చేస్తుండటం గొప్ప విషయం అన్నారు ప్రకాశ్ రాజ్.