
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరు బాక్సాఫీస్ మీద యుద్ధానికి ఓకేసారి దిగితే అది ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఇద్దరు ఒకే పండుగ సీజన్లో రిలీజ్ చేసిన సినిమాల్లో ఒకసారి ఒకరు హిట్ కొడితే మరోసారి మరొకరు హిట్ అందుకున్నారు. అయితే ఇక వచ్చే సంక్రాంతికి కూడా చిరు బాలయ్య ఫైట్ తప్పదని తెలుస్తుంది. అయితే ఇంతకుముందు ఈ ఫైట్ వారి కెరియర్ మొత్తం మీద 18 సార్లు జరిగిందట.
వచ్చే సంక్రాంతితో జరిగే ఫైట్ 19వ సారి అని తెలుస్తుంది. 2001లో చిరు బాలయ్య ఒకేసారి సినిమాలు రిలీజ్ చేయడం జరిగింది. చిరంజీవి మృగరాజుగా వస్తే బాలకృష్ణ నరసింహ నాయుడుగా వచ్చాడు. మృగరాజు ఫ్లాప్ అవగా నరసింహనాయుడు సూపర్ హిట్ అందుకున్నాడు. సో మరి ఈసారి కూడా ఖైది నెంబర్ 150తో చిరు వస్తుండగా బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణిగా రాబోతున్నాడు.
ఇద్దరిలో ఎవరు ఈసారి బాక్సాఫీస్ బాద్షాగా నిలుస్తారో చూడాలి. ఓ విధంగా ఈ ఫైట్ లో ఇద్దరు నెగ్గే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎన్నో భారీ అంచనాలతో శాతకర్ణి రానుండగా ఆల్రెడీ కత్తి లాంటి హిట్ కథతో చిరు ఖైది నెంబర్ 150 రూపొందుతుంది.