యువి క్రియేషన్స్ షాక్ ఇచ్చిన ప్రభాస్ అభిమాని..!

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు ఏర్పరచుకున్న ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రావట్లేదని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. 2022 సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించినా సరే సినిమా నుండి అప్డేట్స్ రాకపోవడంతో ప్రభాస్ వీరాభిమాని ఒకడు సూసైడ్ నోట్ రాశాడు. తన సూసైడ్ కు యువి క్రియేషన్స్ ఇంకా రాధే శ్యామ్ డైరక్టర్ రాధాకృష్ణ కారణమని లెటర్ రాశాడు.   

రెండేళ్లుగా సినిమాను చేస్తున్నా రాధే శ్యామ్ గురించి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని ప్రభాస్ అభిమాని యువి క్రియేషన్స్ వారికి లెటర్ రాశాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ పక్క జనవరి 7న రిలీజ్ అవుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రమోషన్స్ షురూ చేయగా రాధే శ్యామ్ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.