
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఖిలాడి. రవితేజ డ్యుయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా అసలైతే ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వరుస సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. కరెక్ట్ టైం చూసి రిలీజ్ చేద్దామని అనుకుని ఇన్నాళ్లు వెయిట్ చేశారు. ఇక ఈ ఇయర్ ఎండింగ్ నుండి సంక్రాంతి వరకు వరుస రిలీజ్ లు ఉన్నాయి. అందుకే రవితేజ ఖిలాడి సినిమా 2022 ఫిబ్రవరిలో రిలీజ్ ఫిక్స్ చేసుకుంది.
2022 ఫిబ్రవరి 11న ఖిలాడి రిలీజ్ అని చిత్రయూనిట్ ప్రకటించారు. రవితేజ ఖిలాడి సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. క్రాక్ తో హిట్ ట్రాక్ ఎక్కిన రవితేజ ఖిలాడితో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర సినిమాలు చేస్తున్నాడు.