జై భీమ్ IMDB టాప్ రేటింగ్.. వరల్డ్ నెంబర్ 1..!

సూర్య లీడ్ రోల్ లో నటించి నిర్మించిన సినిమా జై భీమ్. జ్ఞానవెల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా అమేజాన్ ప్రైం లో రిలీజైంది. గిరిజన ఫ్యామిలీకి జరిగిన అన్యాయానికి న్యాయవాది ఎలా కాపాడాడు. చట్టం అందరికి సమానమే అని ఎలా ప్రూవ్ చేశాడు అన్నది సినిమా కథ. సినిమా అంతా చాలా సహజంగా తెరకెక్కించారు. ఆల్రెడీ జరిగిన కథనే ఎంతో హృద్యంగా తెరకెక్కించారు దర్శకుడు జానవెల్. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల మనసు గెలిచింది.

ఇక లేటెస్ట్ గా ఐఎండిబి రేటింగ్స్ తో వరల్డ్ నెంబర్ 1 గా నిలిచింది జై భీమ్. ఈ సినిమాకు ఐఎండిబి 9.6 రేటింగ్ ఇచ్చింది. 1994లో వచ్చిన శశాంక్ రెడెమ్షన్ సినిమాకు 9.3 రేటింగ్ ఇచ్చిన ఐఎండిబి ఆ తర్వాత జై భీమ్ కు అత్యధికంగా 9.6 రేటింగ్ ఇచ్చింది. ఇండియన్ సినిమాల్లో ఏ సినిమాకు దక్కని అరుదైన రికార్డ్ జై భీమ్  సొంతమైంది.