అప్పుడు రంగమ్మత్త.. ఇప్పుడు దాక్షాయని..!

సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమా నుండి అనసూయ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలో ఆమె దాక్షాయనిగా నటిస్తుంది. అనసూయ కోసం అద్భుతమైన పాత్రలు రాస్తున్నాడు సుకుమార్. రంగస్థలం లో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టిన అనసూయ పుష్ప లో కూడా దాక్షాయనిగా మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతుంది. సినిమాలో అనసూయ ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెరిగాయి.

డిసెంబర్ 17న రిలీజ్ అవుతున్న పుష్ప సినిమాలో ప్రతి పాత్ర చాలా ఇంపార్టెంట్ అనేలా ఉన్నాయి. రీసెంట్ గా మంగళం శ్రీను పాత్రలో సునీల్ విలన్ లుక్ రివీల్ చేయగా లేటెస్ట్ గా దాక్షాయనిగా అనసూయ అదిరిపోయే లుక్ రిలీజ్ చేశారు. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నాటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుండి ఇప్పటికే వచ్చిన 3 సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.