
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం సినీ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. సినీ ప్రముఖులు అందరు పునీత్ మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియచేశారు. పునీత్ మృతిపై కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆలస్యంగా సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ మరణానికి ఒకరోజు ముందే రజినీకాంత్ కూడా అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరారు. రెండు రోజుల తర్వాత రజినీ ఇంటికి చేరుకున్నారు. వారం పాటు రెస్ట్ తీసుకున్న రజినీకాంత్ పునీత్ రాజ్ కుమార్ కు తన సంతాపాన్ని తెలియచేశారు.
రజినీకీంత్ హూట్ యాప్ లో మాట్లాడుతూ నువ్వు లేవన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను పునీత్.. రెస్ట్ ఇన్ పీస్ మై చైల్డ్ అని అన్నారు రజినీకాంత్.