RRR నాటు సాంగ్.. మాటల్లేవ్ అంతే..!

బాహుబలి తర్వాత ఆ సినిమాకు మించి అనిపించేలా RRR సినిమా చేస్తున్నాడు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ మూవీ నుండి సెకండ్ సాంగ్ నాటు నాటు వచ్చేసింది. ఈమధ్యనే నాటు నాటు ప్రోమో సాంగ్ కే ఫ్యాన్స్ రికార్డులు సృష్టించగా ఈరోజు రిలీజైన ఫుల్ సాంగ్ తో పూనకాలు వచ్చినట్టే చేస్తున్నారు.

చంద్రబోస్ రచించిన ఈ పాటకు కీరవాణి అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఇక నా పాట చూడు అంటూ నాటు డ్యాన్స్ తో నటరాజులు ఇద్దరు దుమ్ము దులిపేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా లిరికల్ సాంగ్ రిలీజ్ సందర్భంగా తారక్, చరణ్ ఇద్దరు కలిసి వేసిన రెండు స్టెప్పులు చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సాంగ్ చూసిన తర్వాత 2022 జనవరి 7 కోసం మెగా నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు.