ఆకట్టుకున్న ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్..!

మెగా డాటర్ నిహారిక నిర్మాతగా తన పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్న వెబ్ సీరీస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. సంగీత్ శోభన్, సిమ్రన్ శర్మ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ నరేష్, తులసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ 5లో రిలీజ్ కానున్న ఈ వెబ్ సీరీస్ కు సంబందించిన ట్రైలర్ ను కింగ్ నాగార్జున రిలీజ్ చేశారు. 

బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్న హీరో.. ఫ్యామిలీకి తెలియకుండా పాతిక లక్షలు లోన్ తీసుకున్న తండ్రి. అతని మరణం తర్వాత కుటుంబ భారం మోయాల్సి రావడంతో హీరో ఏం చేశాడన్నది ఈ వెబ్ సీరీస్ కథ. ట్రైలర్ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఎంటర్టైనింగ్ గా ఉంది. జీ 5లో నవంబర్ 19న ఈ వెబ్ సీరీస్ రిలీజ్ అవుతుంది. హీరోయిన్ గా ఫ్లాప్ అయిన నిహారిక నిర్మాతగా తన సత్తా చాటాలని చూస్తుంది. ఈ వెబ్ సీరీస్ ను మహేష్ డైరెక్ట్ చేశారు.