గోపీచంద్ పక్కా కమర్షియల్ టీజర్..!

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్.ఎల్.బి 2 రీమేక్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈమధ్యనే సినిమా నుండి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ రాగా లేటెస్ట్ గా పక్కా కమర్షియల్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా.. గోపీచంద్ మాస్ ఫాలోయింగ్ ను సాటిస్ఫై చేసేలా ఈ సినిమా ఉంటుందని టీజర్ తోనే చూపించాడు మారుతి.

సినిమా టీజర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. రీసెంట్ గా మంచి రోజులు వచ్చాయి సినిమాతో హిట్ అందుకున్న మారుతి పక్కా కమర్షియల్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. గోపీచంద్ కూడా ఈమధ్య కెరియర్ లో బాగా వెనకపడ్డాడు. ఈ సినిమాతో ఆయన కూడా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జెక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.