పవన్ సరసన పూజా హెగ్దే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీంలా నాయక్ సంక్రాంతి రావడం దాదాపు కన్ ఫర్మ్ అయినట్టే. ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం నిర్మాతలు భీంలా నాయక్ ను వాయిదా వేయమని రిక్వెస్ట్ చేస్తున్నట్టు టాక్. అయితే సినిమా పోస్ట్ పోన్ అవుతుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. ఇక ప్రస్తుతం క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా ఫిక్స్ అయ్యాడు.

హరీష్ శంకర్ తో ఆల్రెడీ గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ అందుకున్న పవన్ ఈసారి అంతకుమించి అనిపించేలా ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది పూజా హెగ్దే. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన దువ్వాడ జగన్నాథం సినిమాతోనే పూజా హెగ్దే పాపులర్ అయ్యింది. అప్పటినుండి ఆ హీరోయిన్ ను వదలని హరీష్ శంకర్ తను డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో ఆమెను పెట్టుకుంటున్నాడు. పవన్ తో చేసే సినిమాకు కూడా పూజా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న పూజా చూస్తుంటే మరో ఐదేళ్లు ఇదే ఫాం కొనసాగించేలా ఉంది.