
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నాడు. ముందు ఒక సినిమాగా అనుకున్న పుష్ప ఇప్పుడు రెండు పార్టులుగా రాబోతుంది. సుకుమార్ ఈ సినిమాను చాలా క్రేజీగా తెరకెక్కిస్తున్నాడని అర్ధమవుతుంది. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన సాంగ్స్ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమా తర్వాత వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు అల్లు అర్జున్. దిల్ రాజు బ్యానర్ లో ఆ సినిమా రాబోతుంది.
ఇదేకాకుండా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి శ్రీను డైరక్షన్ లో బన్నీ సినిమా ఉంటుందని టాక్. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో సరైనోడు సినిమా వచ్చింది. మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. ఆల్రెడీ కథ ఓకే అవగా సినిమాలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ తో కీర్తి సురేష్ జోడీ కడుతుంది. ఓ పక్క ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సరసన నటిస్తుంది కీర్తి సురేష్. బన్నీతో సినిమా ఆమెకి లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.