
సూపర్ స్టార్ మహేష్, పరశురాం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. 2022 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుని సమ్మార్ టార్గెట్ కు షిఫ్ట్ అయ్యింది. సర్కారు వారి పాట సంక్రాంతి రిలీజ్ వాయిదా వేసుకుని ఏప్రిల్ 1న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది.
సంక్రాంతి రేసులో ఆల్రెడీ ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం, భీమ్లా నాయక్ లు వస్తున్నాయి. ఆ సినిమాల మధ్యలో రిస్క్ ఎందుకు అనుకున్నారో ఏమో కాని సర్కారు వారి పాట ఏప్రిల్ కు షిఫ్ట్ అయ్యింది. అంతేకాదు మహేష్ కు ఏప్రిల్ రిలీజ్ సెంటిమెంట్ ఎక్కువ. ఏప్రిల్ లో రిలీజైన మహేష్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే మహేష్ ఏప్రిల్ 1న సర్కారు వారి పాట రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు.