
మాస్ మహరాజ్ రవితేజ తన కెరియర్ లో మొదటిసారి ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. స్టువర్టుపురం దొంగ నాగేశ్వర రావు జీవిత కథతో టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రవితేజ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను వంశీ డైరెక్ట్ చేస్తున్నారు. 1970, 80ల దశకంలో పోలీసులకు చుక్కలు చూపించిన నాగేశ్వర రావు కథతో ఈ సినిమా వస్తుంది.
దొంగ కథతో సినిమా ఏంటని అనుకోవచ్చు. ఆయన దొంగతనం చేసి పేద వాళ్లకు, విద్యార్ధులకు సాయం చేసేవాడు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. సినిమా గురించి మరిన్ని డీటైల్స్ తెలియాల్సి ఉంది. సినిమా టైటిల్ పోస్టర్ తో పాన్ ఇండియా రిలీజ్ అని ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు.