లాలా భీమ్లా.. భీమ్లా నాయక్ సౌండింగ్ అదిరింది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా నుండి లాలా భీమ్లా అంటూ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ప్రోమో రిలీజైంది. నుదుటున బొట్టు, లుంగీ లుక్, ముందు మందు బాటిల్, చేతిలో మందుగొండి సామాను ఇలా మాస్ అప్పీల్ తో భీమ్లా  నాయక్ అదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదరగొట్టారు. 

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఆల్రెడీ లిరికల్ సాంగ్ సూపర్ హిట్ కాగా ఈ సాంగ్ కు సంబందించిన వీడియో ప్రోమో కూడా ఫ్యాన్స్ ను అలరించింది. దీపావళి పండుగ ముందే వచ్చేసింది అంటూ పవన్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. సినిమాలో నిత్యా మీనన్, సం యుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ పోస్టర్ లో కూడా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న భీమ్లా నాయక్ రిలీజ్ అని చెప్పారు. చూస్తుంటే పవన్ వెనక్కి తగ్గేలా లేడని అనిపిస్తుంది. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు త్రివిక్రం.