సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'..!

యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ ప్రస్తుతం శేఖర్ అనే సినిమా చేస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాను నూతన దర్శకుడు లలిత్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ మిడిల్ ఏజ్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పొంగ వార్ లో ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం, భీమ్లా నాయక్ సినిమాలు వస్తున్నాయి. వాటితో పాటుగా రాజశేఖర్ శేఖర్ సినిమా కూడా వస్తుందని తెలుస్తుంది.

అయితే భారీ సినిమాల మధ్య టఫ్ ఫైట్ లో శేఖర్ సినిమా వస్తుందా లేదా అన్నది చూడాలి. గరుడవేగ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాజశేఖర్ లాస్ట్ ఇయర్ వచ్చిన కల్కితో టార్గెట్ మిస్ అయ్యాడు. అయితే శేఖర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు రాజశేఖర్.