వారి బాధ్యత నేను తీసుకుంటా..!

విశాల్, ఆర్య లీడ్ రోల్స్ లో ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎనిమీ. నవంబర్ 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈవెంట్ లో భాగంగా కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను తలచుకుని ఈవెంట్ లో ఆయనకు నివాళులు అర్పించారు చిత్రయూనిట్. పునీత్ లేరనే విషయాన్ని తాను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు విశాల్ ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు సమాజానికి తీరని లోటు అని అన్నారు. పునీత్ లాంటి గొప్ప వ్యక్తిని ఇంతవరకు తాను చూడలేదని అన్నారు విశాల్. నటుడిగానే కాకుండా ఎంతోమంది మనిషి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. 


సమాజానికి పునీత్ ఎన్నో మంచి పనులు చేశారు. చివరకు తన కళ్లు కూడా దానం చేశారు. పునీత్ రాజ్ కుమార్ 1800 మందిని చదివిస్తున్నారని తెలిసింది. ఇక మెదట ఆ 1800 మంది పిల్లల బాధ్యత తాను చూసుకుంటానని అన్నారు విశాల్. ఒక స్నేహితుడిగా పునీత్ సేవా కార్యక్రమాలకు తన వంతు సాయాన్ని అందిస్తానని అన్నారు విశాల్. సినిమాల్లో డైలాగులు చెప్పడం కాదు రియల్ లైఫ్ లో హీరోగా నిలబడితేనే అసలైన హీరో అనిపించుకుంటారు. 1800 మంది పిల్లలను తను చదివిస్తానని చెప్పిన విశాల్ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విశాల్ గొప్ప మనసుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య కూడా పునీత్ సర్ లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని అన్నారు. ఆయన మరణం తీరని లోటు. మిస్ యు సర్ అని ఎమోషనల్ అయ్యారు ఆర్య.