RRR ఫస్ట్ గ్లింప్స్.. బాహుబలి కాదు అంతకుమించి..!

రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా నుండి మరో స్పెషల్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి ఇప్పటివరకు అల్లూరి సీతారామ రాజు పాత్రలో చరణ్, కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్ పాత్రలను పరిచయం చేస్తూ రెండు వీడియోలు వదిలారు. ఇక లేటెస్ట్ గా RRR సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది. జక్కన్న మరోసారి ట్రిపుల్ R తో విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది.

45 సెకన్ల గ్లిపంస్ తో ఒక్క డైలాగ్ లేకుండా విజూల్స్ తోనే వావ్ అనిపించాడు రాజమౌళి. ఇక ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ ఎప్పటిలానే హైలెట్ గా నిలిచేలా ఉంది. RRR ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసిందని చెప్పొచ్చు. ఈ మ్యూజిక్ గ్లింప్స్ చూసిన ఆడియెన్స్ కు గూస్ బంప్స్ వచ్చాయి. ఇక సినిమా ట్రైలర్ వదిలితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 2022 జనవరి 7న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ తో పాటుగా అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఈ సినిమాలో నటిస్తున్నారు.