నాగ శౌర్య 7 డిఫరెంట్ షేడ్స్..!

యువ హీరో నాగ శౌర్య వరుడు కావలను సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సౌజన్య డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇక ఈ సినిమా తర్వాత నాగ శౌర్య లక్ష్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అతను సిక్స్ ప్యాక్ తో మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఇక ఇదేకాకుండా అవసరాల శ్రీనివాస్ డైరక్షన్ లో నాగ శౌర్య సినిమా ఒకటి వస్తుంది. ఆ సినిమా టైటిల్ ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి.. ఈ సినిమాలో నాగ శౌర్య 7 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.

ఎంచుకున్న కథ.. సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే నాగ శౌర్య సినిమా సినిమాకు తన రేంజ్ మార్చుకుంటూ వస్తున్నాడు. బయట సినిమాలతో పాటుగా సొంత బ్యానర్ లో కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. హీరోగానే కాదు రైటర్ గా కూడా నాగ శౌర్య తన సత్తా చాటుతున్నాడు.