
మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. మరోపక్క శరత్ మండవ డైరక్షన్ లో రామారావు సినిమా కూడా సెట్స్ మీద ఉంది. నక్కిన త్రినాథరావుతో కూడా రవితేజ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా రవితేజ 70వ సినిమా కాంబినేషన్ ఫిక్స్ అయ్యింది. సుధీర్ వర్మ డైరక్షన్ లో రవితేజ హీరోగా సినిమా వస్తుంది. దీనికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అక్టోబర్ 31 ఉదయం 10 గంటలకు ఈ సినిమా నుండి మరో సర్ ప్రైజ్ రాబోతుందని ఎనౌన్స్ చేశారు. ఒకవేళ సినిమా టైటిల్ లేద ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారేమో చూడాలి. క్రాక్ తో మళ్లీ ఫాం లోకి వచ్చిన రవితేజ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.