
మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. మామ అంటే ఎప్పుడూ అభిమానం చూపించే అల్లు అర్జున్.. అదే మామతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వస్తే వదులుకుంటాడా. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ కలిసి నటించే ఓ మల్టీస్టారర్ కథ రాసుకున్నాడట సక్సెస్ ఫుల్ డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల. అంతకుముందు వెంకటేష్, మహేష్ లతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తీసి హిట్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల ఈమధ్యనే అసురన్ రీమేక్ గా చేసినా నారప్పతో హిట్ అందుకున్నాడు.
గీతా ఆర్ట్స్ లో అవకాశం కోసం చూస్తున్నా శ్రీకాంత్ అడ్డాల చిరు, అల్లు అర్జున్ మల్టీస్టారర్ కథ సిద్ధం చేసుకున్నాడట. ఆ కథ ఓకే అంటే మాత్రం టాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్ ఫిక్స్ అయినట్టే. చిరు సినిమాలో అల్లు అర్జున్ అటు మెగా ఫ్యాన్స్ కు ఇది సెన్సేషనల్ మూవీ అవుతుందని చెప్పొచ్చు. మరి శ్రీకాంత్ అడ్డాల ఈ కథను వారితో ఒప్పిస్తాడా లేదా అన్నది చూడాలి.