కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇకలేరు..!

కన్నడ కంఠీరవ రాజ్ కుమర్ తనయుడు కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (46) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. జిమ్ వర్క్ అవుట్స్ చేస్తున్న ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో బెంగుళూరులోని విక్రం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఐ.సి.యులో చేర్చి వైద్యులు ఎంత ప్రయత్నించినా పునీత్ రాజ్ కుమార్ ను కాపాడలేకపోయారు. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి కన్నడ స్టార్ గా పునీత్ రాజ్ కుమార్ ఎదిగారు. పునీత్ రాజ్ కుమార్ ను కన్నడ పవర్ స్టార్, అప్పూ అని కర్ణాటక ఆడియెన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. 

పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త విని సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళి ప్రకటించారు.