పుష్ప సామి.. సామి సాంగ్.. దుమ్ముదులిపేస్తుంది..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తారు. సినిమా నుండి ఇప్పటికే రెండు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. దాక్కో దాక్కో మేకతో పాటుగా శ్రీవల్లి సాంగ్ కూడా ఆడియెన్స్ ను అలరించింది. ఇక సినిమా నుండి థర్డ్ సాంగ్ గా.. నువ్వు అమ్మి అమ్మి అంటావుంటే సామి సాంగ్ వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ మార్క్ మాస్ సాంగ్ గా ఈ సాంగ్ వచ్చింది. నువ్వు అమ్మి అమ్మి సాంగ్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సినిమాలో ఈ పాట మాంచి మాస్ డ్యూయెట్ గా వస్తుందని చెప్పొచ్చు. సినిమా నుండి వచ్చిన ఈ సామి సాంగ్ మూవీపై మరింత అంచనాలు పెంచింది. డిసెంబర్ 17న పుష్ప పార్ట్ 1 ది రైజ్ రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న పుష్ప తప్పకుండా అంచనాలను అందుకుంటుందని అంటున్నారు. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.