
అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ లీడ్ రోల్ లో టీజీ కీర్తి కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మళ్ళీ మొదలైంది. మళ్ళీ రావా సినిమాతో హిట్ అందుకున్న సుమంత్ మరోసారి మళ్ళీ సెంటిమెంట్ తో ఈ మూవీ చేస్తున్నాడు. మళ్ళీరావా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులని అలరించింది. ఇక ఇప్పుడు మళ్ళీ మొదలైందితో కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ తో వస్తున్నాడు. సుమంత్ సరసన నైనా గంగూళీ నటించిన ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. హీరో నిఖిల్ రిలీజ్ చేసిన ఈ మళ్ళీ మొదలైంది ట్రైలర్ ఆకట్టుకుంటుంది.
కొన్ని పెళ్లిళ్లకు విడాకులే ముగింపు.. అలాగే కొన్ని విడాకులకు ముగింపు అంటూ ఈ ట్రైలర్ ఆరంభమే ఆకట్టుకుంది. ఆఫ్టర్ డైవర్స్ ఒక మనిషి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మళ్ళీ మొదలైంది వస్తుంది. సినిమాలో యాంకర్ వర్షిణి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో సుమంత్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్నది చూడాలి.