అల్లు అర్జున్ తో త్రివిక్రమ్.. ఏంటి సర్ ప్రైజ్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో మరో సినిమా రాబోతునా.. నాగ శౌర్య నటించిన వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. ఆ ఈవెంట్ కు త్రివిక్రం కూడా స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన వరుడు కావలెను సినిమాకు అల్లు అర్జున్, త్రివిక్రం ఇద్దరు మంచి విజయాన్ని అందుకోవాలని కోరారు.

ఇక ఈ ఈవెంట్ తర్వాత త్రివిక్రం, అల్లు అర్జున్ లతో పాటుగా సితార బ్యానర్ నిర్మాత నాగ వంశీ కలిసి ఫోటోలు దిగారు. ఈ పిక్స్ లో మ్యూజిక్ డైరక్టర్ థమన్ కూడా ఉన్నారు. అయితే ఈ పిక్ షేర్ చేస్తూ త్వరలోనే మీకో సర్ ప్రైజ్ ఉంటుందని అన్నారు నిర్మాత సూర్యదేవగ నాగ వంశీ. అయితే నాగ వంశీ చెప్పే సర్ ప్రైజ్ అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ మూవీ ఎనౌన్స్ మెంట్ అని చెబుతున్నారు. ఆల్రెడీ అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు చేశారు త్రివిక్రం. మూడు సినిమాలు హ్యాట్రిక్ హిట్ కాగా ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కోసం నాల్గవ సినిమా షురూ చేస్తున్నట్టు తెలుస్తుంది.