
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా పెద్దన్న. తమిళంలో అన్నాత్తే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు తెలుగులో పెద్దన్న అని ఫిక్స్ చేశారు. నవంబర్ 4న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఊరికి పెద్దగా ఉంటూ ప్రజల కష్టనష్టాలు చూసే పెద్దన్న తన చెల్లి తలచుకుంటే చాలు ప్రత్యక్షమవుతాడు. అలాంటి చెల్లికి, ఆ ఊరికి కష్టం వస్తే ఏం చేశాడు అన్నది సినిమా కథ.
పెద్దన్న ట్రైలర్ మరోసారి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ లోనే ఇలా ఉంటే సినిమాలో రజినీ మాస్ మ్యానియా ఇంకెలా ఉంటుందో అని అంచనాలు పెంచుకుంటున్నారు. సినిమాలో రజినీ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది.