దుబాయ్ లో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్..!

బాహుబలి తర్వాత ఆ సినిమాను మించే ఇద్దరు స్టార్స్ తో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. సినిమాను 2022 జనవరి 7న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. సినిమా ఈవెంట్ ను దుబాయ్ లో భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని వరల్డ్ వైడ్ చాటి చెప్పిన రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో అంతకుమించి అనిపించేలా స్కెచ్ వేశారు.

ఇక బాహుబలి తరహాలోనే ఆర్.ఆర్.ఆర్ సినిమాకు కూడా ప్రతి అప్డేట్ క్రేజీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్. అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నారు. ఇద్దరు నువ్వా నేనా అనేలా తమ పాత్రలతో నట విశ్వరూపం చూపిస్తారని తెలుస్తుంది. ఒలివియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.