రాధే శ్యామ్ సెకండ్ టీజర్.. ఎప్పుడంటే..!

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న రాధే శ్యామ్ సినిమా నుండి ఈమధ్యనే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. నేను దేవుడిని కాదు కాని నేను మీలో ఒకడిని కాదు అంటూ అదరగొటాడు ప్రభాస్ అయితే ఈ టీజర్ ఫ్యాన్స్ ను మెప్పించినా హీరో, హీరోయిన్ టీజర్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ ను నిరాశపరచింది. అందుకే రాధే శ్యామ్ సినిమా నుండి మరో కొత్త టీజర్ రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ టీజర్ దీపావళి సందర్భంగా నవంబర్ 4న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ఇక రాధే శ్యామ్ సినిమా 2022 సంక్రాంతి రేసులో రానుంది. ఆల్రెడీ జనవరి 7న రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎనౌన్స్ చేశాడు. అయినా సరే రాధే శ్యామ్ వెనక్కి తగ్గకుండా పొంగల్ రేసులో నిలుస్తుందని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ రెండు పాన్ ఇండియా సినిమాలే అవడంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడనుంది.