
కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఘోస్ట్. గరుడవేగ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తుందని అన్నారు. కాని ఆఫ్టర్ మ్యారేజ్ సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్న కాజల్ నాగ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలో కాజల్ వదిలిన ఈ ఆఫర్ ను కోలీవుడ్ భామ అమలా పాల్ అందుకుందని టాక్. కాజల్ అగర్వాల్ ప్లేస్ లో నాగార్జున ఘోస్ట్ లో అమలా పాల్ నటిస్తుందని అంటున్నారు. తెలుగులో చేసింది రెండు మూడు సినిమాలే అయినా అమలా పాల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మడికి అన్నిచోట్ల పాపులారిటీ తగ్గగా మళ్లీ తిరిగి కెరియర్ ఫాం లోకి రావాలని చూస్తుంది అమలా పాల్.