
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న క్రేజీ మూవీ F3. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన F2 సూపర్ హిట్ కాగా అదే కాస్ట్ అండ్ క్రూతో సరికొత్త కథతో ఎఫ్ 3 వస్తుంది. F2 సినిమాకు సీక్వల్ కథతోనే F3 వస్తుందన్న వార్తలను కొట్టిపారేశారు డైరక్టర్ అనీల్ రావిపుడి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఎఫ్3 సినిమా 2022 సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేశారు.
అయితే 2022 పొంగల్ రేసులో చాలా సినిమాలు పోటీ పడుతున్నయి. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్, ప్రభాస్ రాధే శ్యాం తో పాటుగా పవన్, రానాల భీమ్లా నాయక్ కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ టఫ్ ఫైట్ లో F3ని రిలీజ్ చేయడం రిస్క్ అనుకున్న నిర్మాత దిల్ రాజు F3 సినిమాను ఫిబ్రవరి 25న ఫిక్స్ చేశారు. మాములుగా అయితే ఫిబ్రవరి నెలలో పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ చేయరు. కాని కరోనా టైం లో పరిస్థితులు మారాయి. ఫిబ్రవరి లో వచ్చిన ఉప్పెన సూపర్ హిట్ అయ్యింది. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఆచార్యని కూడా ఫిబ్రవరి 4న రిలీజ్ ఫిక్స్ చేశారు. మరి ఫిబ్రవరిలో వస్తున్న ఆచార్య, F3 సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.