జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం..!

67వ జాతీయ చలచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నివహించిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నేషనల్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. 67వ నేషల్ ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా సూప స్టార్ రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. నాలుగు దశాబ్ధాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేస్తున్న సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందించింది. 

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్న రజినీకాంత్ తన గురువు కె.బాలచందర్, తన స్నేహితుడు, తన సోదరుడికి ఈ అవార్డ్ ను అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా తెలుగులో మహేష్ మహర్షి సినిమాకు బెస్ట్ పాపులర్ మూవీ అవార్డ్ తో పాటుగా బెస్ట్ కొరియోగ్రఫీ రాజు సుందరం మాస్టర్ కు అవార్డ్ వచ్చింది. ఇక నాని జెర్సీ సినిమాకు కూడా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డ్ రాగా.. జెర్సీ ఎడిటర్ నవీన్ నూలికి బెస్ట్ ఎడిటర్ అవార్డ్ వచ్చింది. ఇక బెస్ట్ యాక్టర్ గా ధనుష్, మనోజ్ బాజ్ పాయి అవార్డ్ పంచుకున్నారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా మళయాళ సినిమా మరక్కర్ నిలిచింది. మణికర్ణిక సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ గా కంగనా రనౌత్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు.