
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా అనీల్ పాదూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా రొమాంటిక్. సినిమాలో కెతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. అక్టోబర్ 29న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేత రిలీజ్ చేయించారు. ఇక రొమాంటిక్ మూవీ టైటిల్ లానే సినిమా కూడా హీరో, హీరోయిన్స్ మధ్య రొమాన్స్.. మాస్ ఆడియెన్స్ కు కావాల్సిన యాక్షన్ అన్ని ఉన్నాయి.
ఆంధ్రాపోరి, మెహబూబా సినిమాల తర్వాత ఆకాష్ పూరీ చేస్తున్న రొమాంటిక్ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. సినిమాలో హీరోయిన్ కెతిక లుక్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమా తర్వాత అమ్మడికి వరుస ఆఫర్లు రావడం పక్కా అని చెప్పొచ్చు. ఇప్పటికే నాగ శౌర్య లక్ష్య సినిమాలో కెతిక శర్మ నటిస్తుంది.