
మా ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. గెలిచిన ఆనందంలో మంచు విష్ణు.. ఓడిన బాధలో ప్రకాష్ రాజ్ ఇలా ఇద్దరు మళ్లీ మళ్లీ ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మా సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో తాను ఎన్నికల్లో నిలబడ్డానని.. ఓడినా సరే వచ్చే రెండేళ్లూ మా సభ్యుల సంక్షేమం కోసం విష్ణుని, అతని ప్యానల్ సభ్యులని నిద్రపోనివ్వను అని అన్నారు ప్రకాష్ రాజ్. మా అభివృద్ధి కోసం వాళ్లు చేసే కార్యక్రమాల రిపోర్ట్ కార్డ్ అడుగుతానని అన్నారు ప్రకాష్ రాజ్. ఎన్నికల్లో గెలిచి ఉంటే తనకంటూ ఒక పవర్ ఉండేది.. సమస్యల పరిష్కారానికి త్వరగా కృషి చేసే వాడిని.. తనకు ఓటు వేసిన వారి కోసం పని చేస్తానని.. పోలింగ్ రోజు గొడవలు జరిగాయి.. మా వాళ్లని మోహన్ బాబు తిట్టారు. అప్పుడే ఆయనతో మాట్లాడాను.. ఆయ సారీ కూడా చెప్పారని అన్నారు ప్రకాష్ రాజ్.
హాస్య చతురత ఉన్న ఆయన్ను డిస్ట్రబ్ చేయకపోతే చాలా మంచి వ్యక్తి.. డిస్ట్రబ్ చేస్తే ఆయనేం చేస్తారో ఆయనకే తెలియదు అని అన్నారు ప్రకాష్ రాజ్. మా ఎలక్షన్స్ లో రాజకీయ నాయకులు భాగమయ్యారని.. బీజేపీ కూడా పనిచేసిందని అన్నారు ప్రకాష్ రాజ్.