ఆర్జీవీ కామెంట్.. 'మా' సర్కస్..!

సంచలన దర్శకుడు ఆర్జీవీ ఏ విషయం గురించి అయినా కామెంట్ చేశారు అంటే అది హాట్ టాపిక్ గా మారుతుంది. కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్న మా ఎలక్షన్స్ పై రాం గోపాల్ వర్మ తనదైన శైలిలో పంచ్ వేశారు. సిని మా పీపుల్ ఆడియెన్స్ కు ప్రూవ్ చేసింది ఏంటి అంటే.. వారంతా సర్కస్ చేసే వాళ్లని అన్నట్టు ట్వీట్ చేశాడు. తమతో తామకు ఎలా ఉన్నా పైకి మా మధ్య ఏమి లేదని చెప్పే సినిమా వాళ్ల మీద మా సర్కస్ అని కామెంట్ చేయడం హాట్ న్యూస్ గా మారింది.

మా ఎలక్షన్స్ ముగిసి.. మంచు విష్ణు ప్రెసిడెంట్ గా ఎన్నికైనా సరే ఇంకా మా ఎలక్షన్స్ వేడి చల్లారలేదు. ఓ పక్క ప్రకాష్ రాజ్ మా ఎలక్షన్స్ జరిగిన తీరు.. ఆరోజు జరిగిన గొడవల గురించి సీసీ ఫుటేజ్ కావాలని అడిగాడు ప్రకాష్ రాజ్. దీనిపై మంచు విష్ణు కూడా మీకు ఫుటేజ్ కావాలంటే తీసుకోండని అన్నాడు. మొత్తానికి మా వేడి రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదని చెప్పొచ్చు.