తెలుగు వెబ్ సీరీస్ లో త్రిష..!

సౌత్ స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్స్ వెబ్ సీరీస్ లతో అలరిస్తుండగా లేటెస్ట్ గా ఆ లిస్ట్ లో చెన్నై చిన్నది త్రిష కృష్ణన్ కూడా చేరుతుంది. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న త్రిష వెబ్ సీరీస్ ల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. త్రిష ఓ తెలుగు వెబ్ సీరీస్ కు సైన్ చేసినట్టు తెలుస్తుంది.

సోనీ లీవ్ ఓటీటీ కోసం త్రిష వెబ్ సీరీస్ కు ఓకే చెప్పింది. క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సీరీస్ ఉంటుందని తెలుస్తుంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా త్రిష కనిపిస్తుందని అంటున్నారు. ఈ వెబ్ సీరీస్ ను ఆర్ట్ డైరక్టర్ గా ఉన్న అవినాష్ కొల్ల నిర్మిస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ కు ఫిదా మ్యూజిక్ డైరక్టర్ శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించనున్నారు. మరి తిష చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.