క్రిస్ మస్ రేసులో నాని.. నాలుగు భాషల్లో శ్యామ్ సింగ రాయ్ రిలీజ్..!

నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యాం సింగ రాయ్. నాని కెరియర్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దసరా కానుకగా సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అవగా ఆ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ ఫిక్స్ చేశారు. కేవలం తెలుగులోనే కాదు నాని శ్యామ్ సింగ రాయ్ ఏకంగా నాలుగు భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు.

తెలుగు, తమిళంతో పాటుగా కన్నడ, మళయాళ భాషల్లో శ్యామ్ సింగ రాయ్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిజల్ట్ పై నాని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నాని నటించిన వి, టక్ జగదీష్ సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజై నిరాశపరచాయి. అందుకే డిసెంబర్ లో శ్యామ్ సింగ రాయ్ థియేత్రికల్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. మరి రెండు సినిమాల తర్వాత నాని థియేట్రికల్ రిలీజ్ గా వస్తున్న శ్యామ్ సింగ రాయ్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.