మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా 'మంచి రోజులు వచ్చాయి'.. ట్రైలర్ సూపర్ ఫన్..!

టాలీవుడ్ లో ఉన్న సక్సెస్ ఫుల్ డైరక్టర్స్ లో మారుతి ఒకరు. ఆయన నుండి సినిమా వస్తుంది అంటే అది పక్కా ఎంటర్టైనర్ అని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు. ప్రతిరోజూ పండుగే తర్వాత మారుతి నుండి రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి గోపీచంద్ హీరోగా వస్తున్న పక్కా కమర్షియల్ కాగా.. మరొకటి సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న మంచి రోజులు వచ్చాయి. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో సంతోష్ శోభన్ కు జోడీగా మెహ్రీన్ కౌర్ నటించింది. 

నవంబర్ 4న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తేనే సినిమా మరో సూపర్ ఎంటర్టైనర్ మూవీగా అనిపిస్తుంది. తప్పకుండా మారుతి మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా ఉన్నారు. ఏక్ మిని కథతో సూపర్ హిట్ అందుకున్న సంతోష్ శోభన్ మంచి రోజులు వచ్చాయి సినిమాతో మరో హిట్ అందుకునేలా ఉన్నాడు.