
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మొదటి సాంగ్ దాక్కో దాక్కో మేక సాంగ్ రిలీజై సూపర్ హిట్ కాగా ఇప్పుడు సినిమా నుండి సెకండ్ సాంగ్ శ్రీవల్లి అంటూ వచ్చేస్తుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 13న శ్రీవల్లి సాంగ్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక ఒకరోజు ముందే సాంగ్ ప్రోమో వదిలారు.
దేవి మ్యూజిక్.. సిద్ శ్రీరాం గాత్రం ఈ పాటకి స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఇక సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తుంది. సినిమాలో శ్రీవల్లిగా మరోసారి తన సత్తా చాటనుంది రష్మిక మందన్న. పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు అల్లు అర్జున్.