సీక్రెట్ గా తల్లైన శ్రీయ..!

సౌత్ స్టార్ హీరోయిన్ శ్రీయ శరణ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. నిన్నటితరం స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న శ్రీయ ఇప్పటికి మంచి అవకాశాలు అందుకుంటుంది. 2018లో ఆండ్రీ కొచ్చివ్ ను ప్రేమించి పెళ్లాడింది. శ్రీయ. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయడంలో ఆమె జోరు కొనసాగించింద్ది. ప్రస్తుతం శ్రీయ RRR, గమనం సినిమాల్లో నటిస్తుంది. తన ప్రతి అప్డేట్ ను సోషల్ మీడియాలో పెడుతూ ఆడియెన్స్, ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను అలరించే శ్రీయ తన లైఫ్ లో ఒక పెద్ద సీక్రెట్ ను దాచేసింది. సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుని షాక్ ఇచ్చిన శ్రీయ ఇప్పుడు సీక్రెట్ గా బిడ్డకు జన్మనిచ్చింది. 

2020 లాక్ డౌన్ టైం లో తమా జీవితంలోకి ఒక బేబీ వచ్చిందని శ్రీయ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు పాపతో ఉన్న వీడియో కూడా షేర్ చేసింది. 2020 చాలా అందమైన క్వారంటైన్.. ప్రపంచం మొత్తం గందరగోళాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మా ప్రపంచం మారిపోయింది. మా జీవితంలోకి ఒక ఏంజిల్ రావడం చాలా సంతోషంగా ఉంది. మేము దేవుడికి కృతజ్ఞులం అంటూ శ్రీయ తన సోషల్ మీడియాలో కామెంట్ పెడుతూ కూతురుతో ఉన్న పిక్స్ షేర్ చేసింది. శ్రీయ తల్లైన విషయాన్ని తెలుకున్న ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.