సంబంధిత వార్తలు

టాలీవుడ్ నిర్మాత మహేష్ కోనేరు విశాఖపట్నంలో గుండెపోటుతో మృతి చెందారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ లో 118, మిస్ ఇండియా, తిమ్మరుసు సినిమాలను నిర్మించారు మహేష్ కోనేరు. ఎన్.టి.ఆర్ కళ్యాణ్ రాం లకు మహేష్ కోనేరు మేనేజర్ గా పనిచేశారు. మహేష్ మరణ వార్త విని టాలీవుడ్ మొత్తం షాక్ కు గురైంది.
మహేష్ కోనేరు మరణ వార్త విన్న ఎన్.టి.ఆర్ షాక్ కు గురయ్యానని అన్నారు. బరువెక్కిన హృదయంతో చెబుతున్నా.. నా ఆప్తమిత్రుడు మహేష్ కోనేరు ఇక లేరు. నాకు మాటలు రావడం లేదు. మహేష్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని ఎన్.టి.ఆర్ ట్విట్టర్ లో కామెంట్ పెట్టారు.