క్రిష్ డైరెక్షన్ లో వెంకటేష్..!

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరక్టర్స్ లో ఒకరు క్రిష్. ఆయన చేసే ప్రతి సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. గమ్యం నుండి రాబోతున్న కొండపొలం వరకు దర్శకుడిగా తన ప్రత్యేకత చాటుకుంటూ వస్తున్నాడు క్రిష్. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ తో చేసిన కొండప్లం సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో విక్టరీ వెంకటేష్ సినిమా ఉంటుందని అంటున్నారు. వెంకటేష్ తో క్రిష్ సినిమా కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉంది.

రానాతో కృష్ణంవందే జగద్గురుం సినిమా చేసిన టైం లోనే క్రిష్ డైరక్షన్ లో వెంకటేష్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కాని ఈ కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇక లేటెస్ట్ గా క్రిష్ వెంకటేష్ కు ఒక కథ చెప్పారట. వెంకీ కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వెంకటేష్ లాండ్ మార్క్ మూవీ 75వ సినిమా భారీగా ప్లాన్ చేస్తున్నారు. మరి క్రిష్ డైరెక్ట్ చేసే సినిమా అదే అవుతుందా లేదా అన్నది చూడాలి.