
ఆరెక్స్ 100తో సూపర్ హిట్ అందుకోవడమే కాదు మొదటి సినిమాతోనే దర్శకుడిగా తన టాలెంట్ చూపించిన అజయ్ భూపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా మహా సముద్రం చేశారు. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్త్ కలిసి నటించారు. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 14న రిలీజ్ అవుతుంది. ఈమధ్యనే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక సినిమా కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గదని అంటున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఇన్వైట్ చేసినట్టు టాక్. ఈమధ్య సాయి ధరం తేజ్ రిపబ్లిక్ ఈవెంట్ కు వచ్చిన పవన్ అక్కడ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ టైం లో పవన్ మరో సినిమా ఈవెంట్ కు రావడం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. పవన్ ఈసారి ఎలాంటి స్పీచ్ ఇస్తాడు. కేవలం సినిమాల గురించే మాట్లాడతాడా లేక పొలిటికల్ ఎజెండాతో స్పీచ్ ఇస్తాడా అన్నది చూడాలి.