అఖిల్ కోసం సపోర్ట్ గా అన్న వస్తున్నాడు..!

అఖిల్, పూజా హెగ్దే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 8 సాయంత్రం జె.ఆర్.సీ కన్వెషన్ లో జరుగనుంది. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా యువ సామ్రాట్ నాగ చైతన్య అటెండ్ అవుతున్నారని తెలుస్తుంది. 

ఈమధ్యనే లవ్ స్టోరీ అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టిన నాగ చైతన్య ఇప్పుడు తమ్ముడు అఖిల్ సినిమాకు బెస్ట్ విషెస్ అందించేందుకు వస్తున్నాడు. సమంతతో డైవర్స్ ప్రకటన తర్వాత మీడియా ముందుకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించని నాగ చైతన్య. ఇప్పుడు ఏకంగా అఖిల్ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా వస్తున్నాడు. మరి ఈ ఈవెంట్ లో అక్కినేని సోదరులు చేసే హంగామా ఎలా ఉంటుందో చూడాలి.