
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న క్రేజీ మూవీ F3. అనీల్ రావిపుడి డైరక్షన్ లో F2 కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ స్పాట్ లో సడెన్ గా పుష్ప రాజ్ అదేనండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. బన్నీ రాకతో F3 సెట్ అంతా సందడిగా మారింది.
పుష్ప షూటింగ్ గ్యాప్ లో అలా F3 సెట్స్ కు వెళ్లి సందడి చేశారు అల్లు అర్జున్. సినిమా అప్డేట్స్ గురించి అడిగి తెలుసుకుని కాసేపు ముచ్చటించారు. సినిమాలో వెంకటేష్ తో పాటుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్, అల్లు అర్జున్, రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్న పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. F3 సెట్స్ లో పుష్ప రాజ్ హంగామా అంటూ ఈ పిక్స్ సందడి చేస్తున్నాయి.