
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న సినిమా గని. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబి నిర్మిస్తున్నారు. సినిమాలో సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న గని సినిమా నుండి ఫస్ట్ పంచ్ అదేనండి ఫస్ట్ లుక్ టీజర్ వచ్చింది. ఫస్ట్ లుక్ టీజర్ తో పాటుగా సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్.
బాక్సింగ్ కోర్ట్ లో ఆవేశంతో వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఇక పంచ్ పడగానే గని డిసెంబర్ 3న రిలీజ్ అని వేశారు. సో దసరా, దీపావళి అంటూ గని సినిమా రిలీజ్ పై వస్తున్న వార్తలకు ఒక క్లారిటీ వచ్చేసినట్టే. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా బాగా కష్టపడ్డాడని తెలుస్తుంది.