
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ పుష్ప. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా పార్ట్ 1 డిసెంబర్ 17న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ దాక్కో దాక్కో మేక సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు సినిమా నుండి సెకండ్ సాంగ్ రాబోతుంది. సినిమాలో రష్మిక పాత్ర పేరు శ్రీవల్లి సెకండ్ సాంగ్ శ్రీవల్లి అంటూ రాబోతుందని తెలుస్తుంది.
ఈ సాంగ్ ను అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నారు. హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్స్ లో దేవి శ్రీ ప్రసాద్ కు సెపరేట్ స్టైల్ ఉంటుంది. అందులోనూ ఇది సుకుమార్ సినిమా కాబట్టి దేవి శ్రీ ప్రసాద్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. తప్పకుండా పుష్ప పార్ట్ 1లో శ్రీవల్లి సాంగ్ అదరగొడుతుందని చెప్పొచ్చు.